
AP Govt: ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ చేయాలనే ఆశావహులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ సర్వీసెస్ అస్పిరెంట్సుకు ఆర్థిక సాయం జగన్ సర్కార్ చేయనుంది. ఏపీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలనుకునే వారికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహక పథకం పేరుతో ఆర్థిక సాయం అందించనుంది. జగనన్న సివిల్ సర్వీసెస్ పథకానికి గైడ్ లైన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి లక్ష రూపాయలు, 50 వేల చొప్పున ఆర్థిక సహకారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సామాజికంగా, ఆర్ధికంగా, విద్య పరంగా వెనుకబడిన వర్గాల అభ్యర్ధుల్లో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ఈ ఆర్ధిక సహకారం అందజేయనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు రూ. లక్ష, మెయిన్స్ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి 50 వేల చొప్పున ఆర్ధిక సహకారం లభించనుంది. ఈ ఆర్ధిక సహకారాన్ని స్టడీ మెటీరియల్, ఇంటర్వూ గైడెన్స్ , కోచింగ్ కోసం మాత్రమే వెచ్చించాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి చెందిన పౌరుడై ఉండటంతో పాటు , కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 8 లక్షలు దాటకూడదని షరతు విధించింది. కుటుంబానికి 10 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి, 25 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉండకూడదని షరతు పెట్టింది ఏపీ సర్కారు.
పట్టణ ప్రంతాల్లో 1500 చదరపు గజాల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య స్థలం ఉన్న వ్యక్తులు అనర్హులని ప్రభుత్వం పేర్కొంది. ట్యాక్సీ, ట్రాక్టరులను మినహాయించి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదని ప్రభుత్వం తెలిపింది. యూపీఎస్సీ ఫలితాలు వెల్లడించిన 15 రోజుల్లోగానే దరఖాస్తు చేయాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.