
తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ఎంపీ లక్ష్మణ్ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ల సమక్షం లో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయన్నారు. తెలంగాణ ను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం పైన అన్ని వర్గాలు కంకణం కట్టుకొని ఓడించాలని చూస్తున్నారని, కర్ణాటక లో గెలిచాం ఇక్కడ కూడా గెలుస్తామని పొంఖనలు కొడుతున్న కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోపిడీ చేసిన పార్టీ… అది కూడా కుటుంబ పార్టీ అని, బీఆర్‌ఎస్ స్థానం లో కాంగ్రెస్ ను ప్రజలు కోరుకోవడం లేదన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా.. ‘తెలంగాణ లో మార్పు బీజేపీ ద్వారానే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు బీజేపీ కి అండగా నిలబడాలని కృత నిశ్చయం తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అమ్ముకునే పార్టీ… కెసిఆర్ కుటుంబానికి అమ్ముడు పోతారు… బీఆర్‌ఎస్ కొనే పార్టీ. 2014, 2018 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారు.. కాంగ్రెస్ కి వేసిన BRS కు వేసినట్టే..ఈ రెండు పార్టీలకు వేస్తే ఎంఐఎంకి వేసినట్టే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ కి పడకుండా ఎంఐఎం కుట్ర చేస్తుంది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారం లోకి వస్తె ప్రజల చేతిలో చిప్పనే. గల్లీ గల్లీ బెల్ట్ షాపు పెట్టీ ప్రజల రక్తాన్ని బీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం తాగుతుంది. అధికారం లోకి వస్తె బెల్ట్ షాపు లను ఉక్కు పాదం తో అణచి వేస్తాం. మద్యం వ్యాపారాన్ని క్రమ బద్దికరణ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర, ప్రజల భవిష్యత్ కోసం బీజేపీ లో చేరండి, పార్టీ నీ ఆశీర్వదించండి. దోపిడి చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల , మాఫియా గా మారి దోచుకున్న వారిని ఎవరిని వదిలేది లేదు.’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.