Leading News Portal in Telugu

Chandrababu: చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల


Chandrababu: చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల

Chandrababu: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. చంద్రబాబు చర్మ సంబంధిత అస్వస్థతపై సెంట్రల్ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు. జైలు వైద్యాధికారులకు చంద్రబాబు తన చర్మ సమస్యలను తెలియజేయగా.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను పిలిపించారు. ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. చర్మ సంబంధిత సమస్య ఉందని ఆయన చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించామని, డాక్టర్లు పరీక్షలు చేసి మందులను సూచించారని, ఆ మందులను చంద్రబాబుకు అందిస్తామని డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ వెల్లడించారు.

వారి సూచనల మేరకు చంద్రబాబుకు వైద్య సహాయం అందజేస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎటువంటి భయాందోళన అపోహలకు గురికావద్దన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. “చంద్రబాబుకు చర్మ సంబంధిత సమస్య గురించి జైలు అధికారులకు తెలియజేశారు. జైల్లో వైద్యాధికారిణి పరీక్ష చేసి మాకు నివేదిక ఇచ్చారు. మా అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుండి చర్మవ్యాధి నిపుణులు వచ్చి చంద్రబాబును పరీక్షించారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు” అని ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. చంద్రబాబు ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా ఉండటంతో బాబు ఒక్కసారిగా డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ విషయంపై జైల్లో ఉన్న వైద్యాధికారికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం బాబుకు పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.

చంద్రబాబు హెల్త్ బులిటెన్‌
బిపి— 140/80
టెంపరేచర్—నార్మల్
పల్స్—- 87
Spo2—-97
Heart —s1 s2
Lungs —క్లియర్
ఫిజికల్ యాక్టివిటీ —గుడ్