Leading News Portal in Telugu

World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. డెంగ్యూ బారిన మరో భారత దిగ్గజం


World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. డెంగ్యూ బారిన మరో భారత దిగ్గజం

World Cup 2023: 2023 వరల్డ్ కప్ ప్రారంభం నుంచే టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ మ్యాచ్ లకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. డెంగ్యూ బారిన పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మరొకరు డెంగ్యూ బారిన పడ్డాడు. భారతీయ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే డెంగ్యూ బారిన పడ్డారు. అయితే అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు హర్ష దూరం కానున్నాడు. భోగ్లే ‘X’ ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేశారు. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు దూరమైనందుకు నిరాశకు గురవుతున్నట్లు చెప్పాడు. నాకు డెంగ్యూ ఉంది.. అందువల్ల బలహీనత, తక్కువ రోగనిరోధక శక్తి అసాధ్యం చేస్తుంది. 19వ మ్యాచ్‌కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను. నా సహోద్యోగులు, ప్రసార సిబ్బంది చాలా సహాయకారిగా ఉన్నారు. నేను వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎదురుచూస్తున్నానని హర్ష భోగ్లే తెలిపారు.

ఇక గిల్ గురించి మాట్లాడితే.. అతను అహ్మదాబాద్ చేరుకున్నాడు. టీమిండియా అక్టోబర్ 14 శనివారం పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే గిల్ ఆ మ్యాచ్‌లో ఆడుతాడా లేదా అనే దానిపై అధికారిక సమాచారం లేదు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా దిగాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ గోల్డెన్ డక్‌తో ఔట్ కాగా.. ఆఫ్ఘనిస్తాన్ పై 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.