Leading News Portal in Telugu

Dunki Postpone: ఇంతమాత్రం దానికి డైనోసర్ తో పోటీ ఎందుకు కింగ్ ఖాన్?


Dunki Postpone: ఇంతమాత్రం దానికి డైనోసర్ తో పోటీ ఎందుకు కింగ్ ఖాన్?

కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, బాక్సాఫీస్ వార్ ఆఫ్ ది డికేడ్, ఎల్ క్లాసికో… ఎన్నో పదాలు ఉన్నాయో అన్ని పదాలని షారుఖ్ ఖాన్-ప్రభాస్ మధ్య జరగనున్న బాక్సాఫీస్ వార్ కి వాడేశారు. పఠాన్, జవాన్ సినిమాలతో ఫామ్ లో ఉన్న షారుఖ్ డిసెంబర్ 22న డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన సలార్ సినిమా, ఎప్పుడో రిలీజ్ డేట్ లాక్ చేసి పెట్టుకున్న డంకీ సినిమాపై పడింది. సలార్, డంకీ సినిమాలు ఒకే డేట్ ని ఫిక్స్ చేసుకోవడంతో ట్రేడ్ వర్గాలు, సినీ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి.

షారుఖ్ కి పోటీగా ప్రభాస్ రాలేడు అని నార్త్ వాళ్లు, ప్రభాస్ కి ఎదురొస్తే తొక్కి పడేస్తాడని సౌత్ వాళ్లు ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ సలార్ vs డంకీ ఫైట్ కి పర్సనల్ గా మార్చేశారు. దాదాపు నార్త్ vs సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలుగా విడిపోయి సోషల్ మీడియాలో తిట్టుకునే వరకూ వెళ్లారు ఫ్యాన్స్. షారుఖ్ ఖాన్, ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ వార్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నుంచే ఎవరికీ ఎన్ని థియేటర్స్ వస్తాయి? ఎవరు ఓపెనింగ్ రోజున ఎక్కువ కలెక్షన్స్ రాబడుతారు? ఎవరు హిట్ కొట్టి క్లాష్ లో జెండా ఎగరేస్తారు అనే డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో… ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కి షాక్ ఇస్తూ డంకీ సినిమా వాయిదా పడిందని సమాచారం.

ఇల్లీగల్ మైగ్రాంట్స్ కథతో రూపొందుతున్న డంకీ సినిమాని రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్నాడు. రాజ్ కుమార్ హిరాణీ నుంచి సినిమా వస్తుంది అంటేనే అది ఫ్యామిలీ ఆడియన్స్ తో సహా థియేటర్స్ కి వెళ్లి చూసే ఎమోషనల్ డ్రామాలా ఉంటుంది. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ని వాడడు రాజ్ కుమార్ హిరాణీ. డంకీ సినిమా విషయంలో కూడా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ డిలే అవుతూ ఉండడంతో సినిమాని వాయిదా వేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. డంకీ సినిమాని డిసెంబర్ 22 నుంచి తప్పించి జనవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో షారుఖ్ అండ్ రాజ్ కుమార్ హిరాణీ ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే అటు ప్రభాస్ కి డిసెంబర్, ఇటు షారుఖ్ కి జనవరి సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే డంకీ విషయంలో మాత్రం సలార్ సినిమాకి భయపడే షారుక్ తన సినిమాని వాయిదా వేసుకున్నాడు అనే కామెంట్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది.