
Cricket in olympics: ఎన్నాళ్ల నుంచో చర్చలో ఉన్న ఒలింపిక్స్‌లో కిక్రెట్ చేరిక అంశం ఖరారైంది. 2008 లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్ నుంచి క్రికెట్ ను కూడా చేర్చడానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది.
క్రికెట్‌ని లాస్ ఏంజెల్స్ లో జరిగే 2028 ఒలింపిక్స్ గేమ్స్‌లో చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదించిందని, ముంబైలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలోని రెండో రోజు తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. బేస్ బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, స్వ్కాష్, లాక్రోస్‌తో పాటు కొత్తగా చేర్చిన మరో 5 క్రీడల్లో క్రికెట్ కూడా ఉందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. క్రికెట్‌ని కూడా చేర్చాలనే లాస్ ఏంజెల్స్ నిర్వాహకులు ప్రతిపాదనను ఐఓసీ ఆమోదించిందని అన్నారు.