Leading News Portal in Telugu

Minister Amarnath: పవన్ ఓ పొలిటికల్ టూరిస్ట్.. రాజకీయాలకు ఆంధ్రా, నివాసానికి తెలంగాణ కావాలా…?


Minister Amarnath: పవన్ ఓ పొలిటికల్ టూరిస్ట్.. రాజకీయాలకు ఆంధ్రా, నివాసానికి తెలంగాణ కావాలా…?

Minister Amarnath: ఏపీలో లోకల్స్, నాన్ లోకల్స్ మధ్య పోరాటం జరుగుతోందని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వాళ్లకు సమర్ధించే వాళ్ళంతా నాన్‌లోకల్సేనని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలు సమర్థిస్తున్నారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూరిస్ట్ తప్ప రాష్ట్రం మీద ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదని మంత్రి విమర్శించారు. రాజకీయాలకు ఆంధ్రా, నివాసానికి తెలంగాణ కావాలా అంటూ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.

జైల్లో చంద్రబాబు కేజీ బరువు పెరిగారని.. ఈ లెక్కన చంద్రబాబు ఇంట్లో వున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడా ఇంట్లో వున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇంటి నుంచి పంపించే ఆహారంపైనే మాకు అనుమానాలు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు పెట్టె ఆహారం ముందు లోకేష్‌తో తినిపించిన తర్వాతే చంద్రబాబుకు ఇవ్వాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎవరికీ లేని అనుమానాలు కుటుంబ సభ్యులకు కలగడం చూస్తుంటే ప్రమాదం వాళ్ళ నుంచే ఉందని అనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జైల్లో పెట్టడం వల్లే చంద్రబాబు కు అలెర్జీ వచ్చిందనేది కరెక్ట్ కాదన్నారు. స్కిన్ ఎలర్జీ, 73సంవత్సరాల వయసు వంటి భయాలు వున్నప్పుడు తప్పు చేయకుండా ఉండాలన్నారు. చంద్రబాబు వీఐపీ క్రిమినల్ అని.. ఆయన ఆరోగ్యం బాధ్యత మాదని మంత్రి వెల్లడించారు.