
క్రికెట్ అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్. రేపు జరగబోయే ఇండియా-పాకిస్తాన్ కు మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. శుభ్ మాన్ గిల్ 99 శాతం ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. గిల్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నాడని రోహిత్ శర్మ తెలిపాడు. గిల్ ఇటీవల డెంగీ జ్వరం బారిన పడ్డారు. ప్లేట్ లెట్స్ తగ్గడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న గిల్.. రేపటి మ్యాచ్ లో ఆడితే టీమిండియాకు మరింత బలం చేకూరనుంది.
AP High Court: రేపు, ఎల్లుండి ఎస్సై పరీక్షలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అంతేకాకుండా.. జట్టు బౌలింగ్ కాంబినేషన్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామన్నాడు. తాను ఇంకా పిచ్‌ను చూడలేదని చెప్పాడు. అహ్మదాబాద్ మైదానంలో మంచు కురుస్తున్న విషయంపై మాట్లాడుతూ.. అది ఎంత ప్రభావం చూపుతుందో తనకు తెలియదన్నాడు. చెన్నైకి, ఢిల్లీకి పెద్ద తేడా లేదని చెప్పాడు. టాస్‌కు సంబంధించి మాట్లాడుతూ.. టాస్ పెద్ద అంశం కాదని అన్నాడు. తన దృష్టిలో ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమన్నాడు. కొత్త ఛాలెంజ్ లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపాడు. పాకిస్తాన్ మంచి క్వాలిటీ ఉన్న జట్టు అని.. గత రెండు మ్యాచ్ ల్లో తాము బాగా ఆడామని, ఈ విన్నింగ్ ఫామ్ ను ఇలానే కంటిన్యూ చేస్తామని రోహిత్ శర్మ అన్నాడు.
Kriti Shetty: బ్యాక్ లెస్ పోజుల్లో మైండ్ బ్లాక్ చేసిన ఉప్పెన బ్యూటీ..
పాకిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్‌లో 7-0 రికార్డు గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అలాంటి రికార్డులను తాను పట్టించుకోనని అన్నాడు. వారు జట్టుగా మంచి క్రికెట్‌ను ఎలా ఆడాలనే దానిపైనే దృష్టి సారిస్తారన్నాడు. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కు సంబంధించి, జట్టుకు సౌకర్యంగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తానని రోహిత్ చెప్పాడు. ఆ తర్వాత స్వదేశీ ప్రేక్షకుల ముందు ఆడడం గురించి మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదన్నారు.