Leading News Portal in Telugu

Devineni Avinash: మాటిస్తే మాట నిలబెట్టుకునే తత్త్వం సీఎం జగన్‌ది..


Devineni Avinash: మాటిస్తే మాట నిలబెట్టుకునే తత్త్వం సీఎం జగన్‌ది..

Devineni Avinash: పేద వారికి అభివృద్ధి చేయాలంటే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అక్కర్లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాటిస్తే మాట నిలబెట్టుకునే తత్త్వం సీఎం జగన్‌ది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ముప్పై సంవత్సరాల తూర్పు నియోజకవర్గ మైనారిటీల కల ఇవాళ నెరవేరిందన్నారు. సెప్టెంబరు 20, 2022న ఈ షాదీఖానాకు మొదటి అడుగు పడిందన్నారు. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్‌వి అన్నీ మాటలు మాత్రమేనని చేతలు లేవన్నారు. ఆర్&బీ ని ఒప్పించి ఈ షాదీఖానాను ఇప్పించామని.. మరో 50 లక్షలు అదనంగా ఈ షాదీఖానాకు కేటాయిస్తామని మేయర్ చెప్పారన్నారు.

చంద్రబాబుకు ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడమే తెలుసని డిప్యూటీ సీఎం అంజద్ బాషా విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్ళలో జగన్ ఎన్ని హామీలు నెరవేర్చారో అందరికీ తెలుసన్నారు. దేవినేని అవినాష్ చెప్పాడంటే.. చేస్తాడంతేనంటూ ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ఇలాంటి ప్రధాన ప్రదేశంలో 580 గజాలు ఇవ్వడానికి అవినాష్ కృషి చేశారన్నారు. రీటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన తరువాత కృష్ణలంకలో అందరూ హాయిగా నిద్రపోతున్నారన్నారు. తూర్పు నియోజకవర్గ మైనారిటీ ఓటర్లంతా దేవినేని అవినాష్‌కు ఓటెయ్యాలని ఆయన సూచించారు. గతంలో కూరలో కరివేపాకులా మైనారిటీలను తీసిపారేశారన్నారు. ఈ కార్యక్రమం ముస్లింల పండుగలా ఉందన్నారు. మైనారిటీల సంక్షేమం రాజశేఖరరెడ్డి తరువాత జగన్ హయాంలోనే జరిగిందన్నారు. మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని గతంలో ఇక్కడ షాదీఖానాను పట్టించుకోలేదన్నారు. ప్రజలకు అనేక కార్యక్రమాలు చేస్తూ మంచి పరిపాలన సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారన్నారు.