Leading News Portal in Telugu

AP High Court: రేపు, ఎల్లుండి ఎస్సై పరీక్షలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు


AP High Court: రేపు, ఎల్లుండి ఎస్సై పరీక్షలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రేపు, ఎల్లుండి నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల ఎత్తు కొలిచే పరికరాల్లో తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత వున్నప్పటికీ తమని అన్యాయంగా అనర్హతకు గురి చేశారని దాఖలైన పలు పిటిషన్లు మీద హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సైటేషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అనర్హత పొందిన అభ్యర్థులు అందరికీ మళ్లీ శరీర ధారుడ్యం పరీక్షలకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మాన్యువల్‌గా పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ మొత్తం మూడు రోజులలోపు అర్హత వున్న ప్రతి అభ్యర్థికి సమాచారం ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. రేపు, ఎల్లుండి జరిగే తుది రాత పరీక్షపై ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబర్‌ 14, 15 తేదీల్లో మెయిన్‌ ఎగ్జామ్స్ ఉంటాయని ప్రకటించింది. కాగా ఎత్తు విషయంలో తమకు అర్హత ఉన్నప్పటికీ క్వాలిఫై చేయలేదని 5 వేల మంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వారికి మళ్లీ టెస్టులు చేయాలని కోర్టు ఆదేశించింది.