
New Zealand have won the toss and have opted to field: వన్డే ప్రపంచకప్ 2023లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. విల్ యుంగ్ స్థానంలో తాను జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. మరోవైపు తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తెలిపాడు. మహేదీ హసన్ స్థానంలో మహ్మదుల్లా ఆడుతున్నాడని చెప్పాడు.
ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ టాప్ పెర్ఫామెన్స్‌తో దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఘన విజయాలు సాధించిన కివీస్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ విజయం సాధించి అగ్రస్థానంలోకి దూసుకెళ్లని బ్లాక్ క్యాప్స్ చూస్తోంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లా.. రెండో విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే.. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం అన్న విషయం తెలిసిందే.
తుది జట్లు:
బంగ్లాదేశ్: లిటన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెఫైన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
New Zealand vs Bangladesh today
New Zealand won the opt to bowlGood luck blackcaps 👍#CWC23 #NewZealand #INDvPAK #ICCCricketWorldCup23 pic.twitter.com/WgfYrC60qN
— Gauravgupta (@Gauravg2152) October 13, 2023