Leading News Portal in Telugu

Union Minister Parshottam Rupala: ప్రధానమంత్రి యోజన పథకం కింద ఏపీకి రూ.2,500 కోట్ల అదనపు నిధులు


Union Minister Parshottam Rupala: ప్రధానమంత్రి యోజన పథకం కింద ఏపీకి రూ.2,500 కోట్ల అదనపు నిధులు

Union Minister Parshottam Rupala: ప్రధానమంత్రి యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు ఇతర రాష్ట్రాల కంటే అధికంగా రూ.2 వేల 500 కోట్ల మేర నిధులు ఇచ్చామని తెలిపారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా.. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ఆయన.. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సింహపురి సేంద్రియ మేళాను ఏపీ మంత్రి అప్పలరాజు, ఎంపీలు బీద మస్తాన్ రావు, జీవీఎల్‌ నరసింహారావు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి పరిశీలించారు.. సేంద్రియ, మత్య్స ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్ర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నానని తెలిపారు.. దేశంలో మూడు కోట్ల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి.. వీరి సంక్షేమం కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని రూ.20 వేల కోట్లతో తీసుకువచ్చారు.. దేశానికి ఎంతో తీర ప్రాంతం ఉంది.. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ నుంచి దేశం మొత్తం మీద 30 శాతం సముద్ర ఆహార ఉత్పత్తులు వస్తున్నాయని వెల్లడించారు.

సముద్ర పరిక్రమకార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలలో పర్యటిస్తున్నాను అని తెలిపారు పురుషోత్తం రూపాలా.. మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు స్పెషల్ అండ్ సెంటర్‌లో హార్బర్లను కూడా అభ్యసిలిస్తున్నాం అన్నారు. ఒక గ్రామంలో మత్స్యకార గ్రామంలోకి వెళ్లి మత్స్యకారుల ఇంటికి వెళ్లి కూర్చొని మాట్లాడడం వంటి అవకాశం కేవలం మోడీ ప్రభుత్వంలో సముద్ర ప్రతిని కార్యక్రమం ద్వారానే సాధ్యమైందన్నారు. ఇక, ప్రధానమంత్రి యోజన పథకం కింద ఏపీకి ఇతర రాష్ట్రాల కంటే అధికంగా రూ.2,500 కోట్ల మేర నిధులు ఇచ్చాం.. ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజు మరో రెండు ప్రాజెక్టులు అడిగారు.. వాటిని కూడా పరిశీలిస్తాం అన్నారు. ఇక, చేపల ఉత్పత్తులను అమూల్ సంస్థ తరహాలో సహకార రంగం ద్వారా మార్కెటింగ్ చేయాలన్నారు.. మత్స్యకారులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా ఇస్తున్నాం.. ఆంధ్ర ప్రదేశ్ లోని మత్స్యకారులకు కూడా ఈ కార్డులు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా.