Leading News Portal in Telugu

Minister Seediri Appalaraju: రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..!


Minister Seediri Appalaraju: రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..!

Minister Seediri Appalaraju: కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాకో హార్బర్ ను సీఎం వైఎస్‌ జగన్ నిర్మిస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సింహపురి సేంద్రియ మేళాను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా.. ఎంపీలు బీద మస్తాన్ రావు, జీవీఎల్‌ నరసింహారావు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి పరిశీలించిన మంత్రి అప్పలరాజు.. సేంద్రియ, మత్య్స ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వెల్లడించారు.. వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తవుతున్నాయి.. ఫిష్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా సముద్ర ఆహార ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.