Leading News Portal in Telugu

Boycott IND vs PAK Match: భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి.. నెటిజన్ల డిమాండ్! కారణం ఏంటంటే?


Boycott IND vs PAK Match: భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి.. నెటిజన్ల డిమాండ్! కారణం ఏంటంటే?

Boycott indo pak match trending in Twitter Ahead Of IND vs PAK Match: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌ 2023లో హైఓల్టేజ్ మ్యాచ్‌ మరో కొన్ని గంటల్లో జరగనుంది. శనివారం (అక్టోబరు 14) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో.. ఐసీసీ ఈవెంట్లలో తలపడే దాయాదుల సమరంకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్‌ను ‘బాయ్‌కాట్’ చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వేడుకలు:
భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రపంచకప్ 2023కి ఆరంభ వేడుకలు లేకున్నా.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని బీసీసీఐ నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ కార్యక్రమానికి సచిన్‌ టెండుల్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ సహా పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌లో అర్జిత్‌ సింగ్‌, నేహా కక్కర్, శంకర్ మహదేవన్ ప్రదర్శన ఉండనున్నట్లు తెలుస్తోంది.

పాక్ ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం:
టీమిండియాతో మ్యాచ్ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాక్ జట్టు అహ్మదాబాద్ చేరింది. అయితే విమానంలో అడుగుపెట్టగానే పాక్ ఆటగాళ్లకు విమాన సిబ్బంది సర్ ప్రైజ్ చేసారు. పాక్ క్రికెటర్లతో కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు. ఆపై అహ్మదాబాద్ హోటల్లో బీసీసీఐ ప్రత్యేక ఆహ్వానం ఏర్పాటు చేసింది. పాక్ ప్లేయర్స్ హోటల్ లోపలి వస్తుండగా.. కొందరు మహిళలు పూలు జల్లి డాన్స్ చేశారు.

భారత ఆర్మీ మరణం:
సెప్టెంబర్ 13న కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ కల్నల్‌తో పాటు రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన ఒక మేజర్ మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమాండింగ్‌ మరణించారు.

భారత్, పాకిస్తాన్ మధ్య ఉగ్రవాద యుద్ధం కొనసాగుతున్న సందర్భంలో పాకిస్తానీ ఆటగాళ్లను ఈ విధంగా ట్రీట్ చేయడం ఎందుకు చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం చేసిన పాక్ దేశానికి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. సైనికులను పాక్ ఉగ్రవాదులు చంపుతుంటే.. భారత్ మాత్రం పాక్ ఆటగాళ్లకు ఆహ్వానం అందించి వారికి సన్మానాలు, సత్కారాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే అమరులైన సైనికులను అవమానించడమే అని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో బాయ్‌కాట్ ఇండో పాక్ మ్యాచ్ (#Boycottindopakmatch), బాయ్‌కాట్ బీసీసీఐ (BoycottBCCI), షేమ్ ఆన్ బీసీసీఐ (ShameOnBCCI) అనే హ్యాష్‌ ట్యాగ్‌లతో ట్విటర్‌లో నెటిజన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు.