Leading News Portal in Telugu

Leo Plot: ఎల్సీయూ కాదు.. అసలు కథ లీకయ్యిందిగా?


Leo Plot: ఎల్సీయూ కాదు.. అసలు కథ లీకయ్యిందిగా?

Leo Plot Leaked: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రొమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను సితార నాగవంశీ దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ LEO సినిమా కథ లీక్ అయినట్టు ప్రచారం అవుతోంది.

Bhagavanth Kesari: భగవంత్ కేసరి సెన్సార్ రివ్యూ.. నెవర్ బిఫోర్ అంటూ!

LEO చిత్రం ప్రధాన ట్విస్ట్ సంజయ్ దత్ పాత్రతో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక టీమ్ మెంబర్ ఈ సినిమా కథ లీక్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్‌కి తండ్రిగా సంజయ్‌దత్‌ నటిస్తున్నారని, తండ్రీకొడుకుల మధ్య జరిగే గొడవలే ఈ సినిమా అసలు కథాంశమని అంటున్నారు. ఈ లైన్ వింటుంటే విక్టరీ వెంకటేష్ ధర్మ చక్రం సహా అనేక ఇతర తెలుగు – తమిళ సినిమాలను గుర్తు చేస్తుందని అంటున్నారు. LEO సినిమా ఆ సినిమాలను పోలి ఉండవచ్చని అంటున్నారు. LEO విజయ్‌ని రెండు అవతారాలలో, డబుల్ యాక్షన్‌లో కూడా కనిపించవచ్చని మరొక పుకారు కూడా ఉంది. ప్రస్తుతానికి, ఈ సినిమా గురించి ఇంకా ఏమీ బయటకు రాకుండా దర్శకుడు జాగ్రత్త పడుతున్నారు. రామ్ చరణ్ అతిధి పాత్ర అని ఫహద్ ఫాజిల్ అతిథి పాత్ర అని సినిమా గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో ఏం జరగనుందో చూడాలి.