Leading News Portal in Telugu

ఎవరీ మురళీ చెముటూరి | who is murali chemuturi| softwere| expert| life| time| achievement


posted on Oct 14, 2023 4:39PM

భారతీయ ప్రముఖ సాఫ్ట్‌వేర్ నిపుణుడు మురళీకృష్ణ  చెముటూరి  జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకొన్నారు. అక్టోబర్12వ తేదీ అంటే గురువారం దుబాయిలో నిర్వహించిన 23వ వార్షిక ఏషియన్ లీడర్ షిప్ సదస్సులో.. ఆయన  స్థానిక రాజకుటుంబానికి చెందిన రాజకుమారిల చేతుల మీదగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 73 ఏళ్ల వయస్సులో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోవడం పట్ల.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇంతకీ ఎవరీ మురళీ చెముటూరు అంటే.. పక్కా తెలుగు వారు. భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచడమే కాకుండా.. ఆధ్యాత్మిక రంగంలోకి సైతం ఆయన విశేషమైన కృషి చేశారు.

1950, జున్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని చిట్యాలలో అప్పారావు, విజయలక్ష్మీ దంపతులకు మురళీ కృష్ణా చిముటూరు జన్మించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఎస్‌ఎమ్‌విఎమ్ పాలిటెక్నిక్ కాళశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లామా అందుకొన్న ఆయన.. ఆ తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ నుంచి ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అనంతరం కంప్యూటర్ మెథడ్స్ అండ్ ప్రోగ్రామింగ్‌లో పీజీ డిప్లమో పూర్తి చేశారు. వీటితోపాటు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టాను సైతం మురళీ చిముటూరి అందుకొన్నారు. 

ఆ తర్వాత ఈసీఐఎల్‌లో ఉద్యోగంలో చేరిన ఆయన.. టాటా కన్సల్‌టెంట్ సర్వీసెస్, హైదరాబాద్‌లోని మెటమార్ గ్లోబల్  సోల్యూషన్స్ తోపాటు ముంబైలోని విస్తార్ ఇ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేశారు. అనంతరం 2001లో చెముటూరి కన్సల్‌టెన్స్‌ను ప్రారంభించి… సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఆర్జనైజేషన్ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. 

ఆ క్రమంలో ఆయన రాసిన వివిధ ఆర్టికల్స్ ప్రముఖ జనరల్స్‌.. కంప్యూటర్ సోసైటి ఆఫ్ ఇండియా జనరల్, ఇండస్ట్రీయల్ ఇంజినీర్, ది జనరల్ ఆఫ్ అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్, అమెరికన్ వెబ్‌సైట్స్‌లో సైతం ప్రచురితమైనాయి. ఆయన రాసిన దాదాపు అన్ని జనరల్స్ చెముటూరి డాట్ కామ్‌లో లభ్యమవుతున్నాయి. 

అలాగే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తోపాటు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా ప్రాసెసింగ్, ట్రైనింగ్, అలాగే ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌లోని పని చేసిన ఆయన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎఫర్ట్ ఎస్టిమేషన్, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి అమూల్యమైన గ్రంధాలను సైతం ఆయన ప్రపంచానికి అందించారు.

 ఆటోమోటివ్ పరిశ్రమకు రాల్ప్ నాడర్ ఎలాంటి వారో… అలాగే సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పరిశ్రమకు మురళీ చిముటూరి అంతటి వారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుపానులను ఆయన గుర్తించడమే కాదు.. ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తూ.. అందుకోసం ఆయన రాసిన వ్యాసాలు.. అన్ని రంగాల వారిని ఆకట్టుకొవడం విశేషం. ఆయన ఇన్పర్మేషన్ టెక్నాలజీ రంగానికి చేసిన కృషికి గాను ముంబైలోని కంప్యూటర్ సొసైటి ఆప్ ఐటీ ఇన్నోవేషన్ మరియు ఎక్సలెన్స్ అవార్డును కూడా మురళీ చిముటూరు అందుకొన్నారు. 

ఇక మురళీ చిముటూరి.. ఆధ్యాత్మిక రంగంలో సైతం విశేష కృషి చేశారు. అందులోభాగంగా రామయణం, ఉత్తర రామాయణం, గరుడ పురాణం పుస్తకాలను ఆయన రచించి, ప్రచురించారు. అలాగే.. రామాయణంలోని 537 సర్గల్లోని ప్రతీ శ్లోకాన్ని వివరణ ఇస్తూ ఆయన పఠించారు. అదే విధంగా ఉత్తర రామాయణాన్ని, గరుడు పురాణం, మను స్మృతి, గురు గీత, అను గీత, రహస్య గీత, బ్రాహ్మణ గీత, యదిష్టుర గీత, ధర్మవ్యాదుడు ఉపాఖ్యానం, భగవద్గీత, ఉమా మహేశ్వర సంవాదంకు సంబంధించి.. ఆయన ఫఠించిన వీడియోలు.. ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. అటు ఐటీ పరిశ్రమ అభివృద్ధితోపాటు ఇటు ఆద్యాత్మిక రంగానికి సేవ చేస్తున్న ఆయన కృషిని మెచ్చి.. ఎన్నో అవార్డులు అందుకొన్నారీ మురళీ చిముటూరి.