Leading News Portal in Telugu

Pension Scheme: కేవలం రూ. 210 కడితే..నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చు..


Pension Scheme: కేవలం రూ. 210 కడితే..నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చు..

కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తూ వస్తున్నారు.. పలు పథకాలు జనాలకు ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.. అందులో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి.. పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా మోడీ సర్కార్ పెన్షన్‌ స్కీమ్‌ను అందిస్తోంది.. ఈ స్కీమ్‌లో చేరినట్లయితే 60 ఏళ్ల తర్వాత మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్‌ పొందవచ్చు. ఆ సమయంలో మీకు ఎవరి సహాయం అవసరం లేకుండా కేంద్రం నుంచి వచ్చే పెన్షన్‌ డబ్బులతో జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చు..

మీకు ప్రతి నెల ఎంత పెన్షన్ అవసరమో అంతవరకే పెన్షన్ ను పొందేలా చూసుకోవచ్చు.. అవసరం లేదా నెలవారీ ఆదాయం ఎంత అవసరం, అలాగే దాని ప్రకారం పెట్టుబడి పెట్టండి. ఇలా అనేక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక రాబడికి అవకాశం ఉంది. కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.. ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందే స్కీమ్ ఒకటి ఉంది. అదే అటల్ పెన్షన్ స్కీమ్ ఒకటి.. ఇది 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల తక్కువ ఆదాయ వర్గ వ్యక్తుల పదవీ విరమణ జీవితానికి ఆధారాన్ని అందించడానికి రూపొందించబడిన పథకం. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందేందుకు ఈ పథకం సహాయపడుతుంది..

ఇకపోతే ఈ పెన్షన్ ను పొందడానికి గరిష్ట వయస్సు..40 సంవత్సరాలు.. మీరు అప్పుడే పథకంలో చేరితే మీకు 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు రూ.1,454 చెల్లిస్తే నెలవారీ రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. పింఛను తక్కువ, నెలవారీ వాయిదా తగ్గుతుంది. ఉదాహరణకు రూ.1000 నెలవారీ పెన్షన్ కావాలంటే నెలకు రూ.291 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది..అదే18 ఏళ్ల నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెడితే, నెలకు రూ.210 చెల్లిస్తే మీరు ప్రతి నెల రూ.5000 వేల పెన్షన్ పొందవచ్చు..18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వయస్సు ఉన్న వాళ్లు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు..