Leading News Portal in Telugu

Indian Army: ఆర్మీ హెలికాప్టర్ ప్రయాగ్‌రాజ్‌లో అత్యవసర ల్యాండింగ్.. ఇదే కారణమా..?


Indian Army: ఆర్మీ హెలికాప్టర్ ప్రయాగ్‌రాజ్‌లో అత్యవసర ల్యాండింగ్..  ఇదే కారణమా..?

Breaking news: దేశం రక్షణలో ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు ఆర్మీ సైనికులు. ప్రతి క్షణం వాళ్ళకి కత్తి మీద సాములాంటిదే. ఏమాత్రం ఆదమరిచి ఉన్న అపాయం ముంచుకు వస్తుంది. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం..శనివారం ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో భారత సైన్యానికి చెందిన చేతక్ హెలికాప్టర్ ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలలోకి వెళ్తే శనివారం ఒక సాధారణ శిక్షణా మిషన్‌లో పాల్గొన్న చేతక్ హెలికాప్టర్ ని అత్య అవసరంగా ల్యాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ ఇంజినీరింగ్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సాంకేతిక తనిఖీలు నిర్వహించింది. ఆ తర్వాత హెలికాప్టర్‌ను తిరిగి ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Read also:Bihar: యూట్యూబ్ లో ఫెమస్ అయితే చంపేస్తారా..? ఇదెక్కడి న్యాయం..!

సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఈ ఘటన గురించి ఓ ప్రకటనలో మాట్లాడారు. చేతక్ హెలికాప్టర్ శిక్షణ మిషన్ లో పాల్గొన్న సమయంలో సాంకేతిక లోపాలకు గురైనట్లు అనిపించింది. వెంటనే ముందస్తు జాగ్రత్తగా హెలికాప్టర్ ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. కాగా ఈ ఘటన లో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆర్మీ ఇంజినీరింగ్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సాంకేతిక తనిఖీలు నిర్వహించిందని, అనంతరం హెలికాప్టర్ ని యధావిధిగా శిక్షణ మిషన్ లో ఉపయోగించమని ఆయన తెలిపారు. ముందుగానే హెలికాప్టర్ లోని సాంకేతిక లోపాలను గుర్తించడం ద్వారా జరగబోయే ప్రధాని ఆపగలిగారు అని లేకపోయి ఉంటె పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అభిప్రాయం పడుతున్నారు ఈ ఘటన గురించి తెలిసిన వారు.