Leading News Portal in Telugu

Martin Luther King: అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’


Martin Luther King: అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’

Martin Luther King to Release on October 27th: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” రిలీజ్ కి రెడీ అవుతోంది. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య సినిమా టీజర్ గాంధీ జయంతి రోజున విడుదలై అద్భుతమైన స్పందన పొందింది. తెలుగు సినిమాల్లో ఇది కొత్త అనుభూతిని ఇస్తుందని ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు నటుడిగా ఆకర్షణీయమైన ఓ కొత్త పాత్రలో అలరించనున్నారని అంటున్నారు. అక్టోబర్ 9 నుండి సినిమా యూనిట్ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ పర్యటనను ప్రారంభించి విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు మరియు వరంగల్ వంటి నగరాల్లో ముందస్తు ప్రీమియర్‌ షోలను ప్రదర్శించగా ఈ ప్రీమియర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 18న విడుదల కానుంది.

Leo Plot: ఎల్సీయూ కాదు.. అసలు కథ లీకయ్యిందిగా?

అలాగే ఆ వీకెండ్ లో విడుదలవుతున్న భారీ చిత్రాలతో పాటు అక్టోబర్ 19 నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 400 థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శించబడుతుంది. ఈ ‘మార్టిన్ లూథర్ కింగ్’ ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి కథ, తను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికల్లో అతని ఓటు, గెలుపు నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. తమిళంలో తెరకెక్కిన మండేలా సినిమాకి ఇది రీమేక్. ‘మార్టిన్ లూథర్ కింగ్’ 2023, అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలో పంపిణీ భాగస్వామిగా వ్యవహరిస్తుందని ఏపీ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ పంపిణీ భాగస్వామిగా ఉంటుందని అంటున్నారు.