Leading News Portal in Telugu

Beauty Tips : మీ చర్మాన్ని అందంగా మార్చే అద్భుతమైన డ్రింక్స్..


Beauty Tips : మీ చర్మాన్ని అందంగా మార్చే అద్భుతమైన డ్రింక్స్..

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. దాని కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కెమికల్ ప్రోడక్స్ట్ వాడి కాకుండా న్యాచురల్ గా అందంగా మారాలని అనుకుంటారు.. దాంతో కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ లను తాగుతుంటారు.. ఏ కాయలతో చేసిన జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కూరగాయలు, పండ్ల రసాలు కూడా శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది కాంతివంతమైన ఛాయను ఇస్తుంది.. క్యారెట్ వంటి కూరగాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం మృదుత్వాన్ని మెరుగుపరుస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. కూరగాయలు, పండ్ల రసాలను ఎలా తీసుకోవాలి. మన చర్మానికి ఏ రసం ఉపయోగపడుతుందో ఆర్టికల్ ను చదివి తెలుసుకోండి..

విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉండే ఆరెంజ్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దానిమ్మ రసంలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది..

బీట్ రూట్ జ్యూస్ లలో విటమిన్లు, బీటాలైన్‌లు సమృద్ధిగా ఉంటాయి. బీట్‌రూట్ యాంటీఆక్సిడెంట్ రక్షణను పెంచుతుంది. అలాగే, ఇది ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ ఒక ఆరోగ్యకరమైన ఎంపిక, ఇది హృదయ సంబంధ సమస్యలను నియంత్రించడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది..జుట్టును పెంచడంలో కూడా సహాయపడుతుంది..

పాలకూర రసంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది చర్మం గ్లో పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో ఉండే ఫోటోప్రొటెక్టర్, సహజ సౌందర్యాన్ని పెంచే బీటా కెరోటిన్, సూర్యుని అతినీలలోహిత కిరణాల ప్రభావాలను తగ్గిస్తుంది.. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది…. అలాగే ముల్లంగి జ్యూస్ కూడా చాలా మంచిది.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.. ఈ జ్యూస్ లన్నిటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..