Leading News Portal in Telugu

Chandrababu Arrest: చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ప్రభుత్వ వైద్యుల ప్రకటన


Chandrababu Arrest: చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ప్రభుత్వ వైద్యుల ప్రకటన

Chandrababu Arrest: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. ఆయనకు చల్లటి వాతావరణం అవసరమని వారు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యలో ప్రభుత్వ వైద్యులతో కలిసి జైళ్ల శాఖ డీఐజీ మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ..” చంద్రబాబు వేసుకునే మందులు మాకు చూపించారు. అవి చూసిన తర్వాతే మిగతా మందులను ఆయనకు సూచించాం. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని జైలు అధికారులకు సూచించాం. చంద్రబాబుకు అన్ని రకాల పరీక్షలు చేశాం.. హాస్పటల్‌కు తరలించాల్సిన అవసరం లేదు.. చంద్రబాబు 67 కేజీల బరువు ఉన్నారు.. చంద్రబాబుకు పర్సనల్‌ డాక్టర్‌ సలహా మేరకు పరీక్షలు చేశాం చంద్రబాబుకు స్టెరాయిడ్స్‌ ఏమీ ఇవ్వడం లేదు.. ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు వైద్య సేవలు అందించమని చంద్రబాబు చెప్పారు.. ఇప్పుడున్న వాతావరణంలో ప్రతి ఒక్కరికి కూడా డీహైడ్రేషన్‌ ఉంటుంది. చల్లటి ప్రదేశం లేకుంటే మేము ఇచ్చిన మందులు ఎంతవరకు పని చేస్తోయో తెలియదు.” అని ప్రభుత్వ వైద్యులు వివరించారు.

జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మాట్లాడుతూ.. “వైద్యుల నివేదికను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిస్తున్నాం.. చంద్రబాబుకు అవసరమైతే అత్యవసర వైద్యం అందించడానికి వైద్య బృందం సిద్ధంగా ఉన్నారు.. వైద్యుల రిపోర్టును ఏమి తగ్గించి చెప్పం.. కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో మార్పు ఉండదు.. కోర్టు ఆదేశాల మేరకు ఫ్యామిలీ డాక్టర్ మెడిసిన్ ఇమ్మంటే ఇస్తాం.. నిబంధనల ప్రకారమే ములాకత్‌లకు అనుమతిస్తున్నాం. చంద్రబాబు లాంటి ప్రముఖ వ్యక్తి ఆరోగ్యం, భద్రత విషయంలో అప్రమత్తంగా ఉన్నాం. జైలులో ఏసీ పెట్టేందుకు ప్రిజన్‌ రూల్స్‌ ఒప్పుకోవు. ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తాం”అని పేర్కొన్నారు.