
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ సామ్సంగ్.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది.. దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.. సామ్సంగ్ గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రూ. 15వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది..
ఈ ఫోన్ ఫీచర్స్ పై ఎటువంటి ప్రకటన రాకపోయినా కూడా ఆన్లైన్లో ఈ ఫోన్ ఫీచర్స్ అనేవి లీక్ అయ్యాయి.. లీకైనా ఫీచర్స్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను అందించనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.. క్వాలిటీ వీడియో రికార్డింగ్ కూడా ఉందని సమాచారం..
ఇకపోతే సామ్సంగ్ గ్యాలక్సీ ఏ05ఎస్ స్మార్ట్ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. అలాగే 2 ఏళ్ల ఆపరేటింగ్ సిస్టమ్, 4 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ను ఇవ్వనున్నారు. గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.. చివరగా ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికొస్తే 12 జిబి ర్యామ్‌ను కలిగి ఉందని తెలుస్తుంది..