Leading News Portal in Telugu

Vijayawada: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు..



Indrakiladri

ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు కనిపించనున్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి స్వపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేసేశారు. దీంతో తొలి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయడంతో ధగధగ మెరసి పోతుంది. ఇక, ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుండటంతో అధిక సంఖ్యలో భక్తులు ఉదయాన్ని ఇంద్రకీలాద్రి కొండకు క్యూ కట్టారు.

Read Also: Virat Kohli: మ్యాచ్ మధ్యలో డగౌట్‌కు పరుగెత్తిన విరాట్ కోహ్లీ.. కారణం ఏంటో తెలుసా?

దీంతో ఇంద్రకీలాద్రిలో క్యూ లైన్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఈ ఉత్సవాల్లో తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని దర్శిస్తే తాము కోరుకున్న ఫలితాలు అన్నీ దక్కుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో దర్శనం కోసం కూడా దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. వీఐపీ వాహనాలు మినహా ప్రైవేటు వెహికిల్స్ ను ఇంద్రకీలాద్రి పైకి ఈరోజు నుంచి అనుమతించడం లేదు అని ఆలయం అధికారులు వెల్లడించారు.