posted on Oct 15, 2023 7:47AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం (అక్టోబర్ 15)శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో, కంపార్ట్ మెంట్ లో వేచి చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ లైన్ ద్వారా వెడుతున్నారు.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదు ఐదు గంటల సమయం పడుతోంది. ఇక శనివారం ( అక్టోబర్ 14) శ్రీవారిని 67వేల 785 మంది దర్శించుకున్నారు.
వారిలో 21వేల 284 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హేండీ కానుకల ఆదాయం 2 కోట్ల 78లక్షల రూపాయలు వచ్చింది.