Leading News Portal in Telugu

Asaduddin Owaisi: నెతన్యాహు ఒక దెయ్యం, పీఎం మోడీ గాజాను రక్షించాలి.. ఒవైసీకి ఎందుకు కోపం వచ్చింది?


Asaduddin Owaisi: నెతన్యాహు ఒక దెయ్యం, పీఎం మోడీ గాజాను రక్షించాలి.. ఒవైసీకి ఎందుకు కోపం వచ్చింది?

Asaduddin Owaisi: ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాలని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ యుద్ధంలో చాలా మంది ప్రజలు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. నేటికీ పోరాడుతున్న గాజా వీర సైనికులకు లక్షలాది వందనాలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.

అసదుద్దీన్ ఒవైసీ ఇజ్రాయెల్ అధ్యక్షుడిపై విమర్శల వర్షం కురిపించారు. నెతన్యాహు ఒక దెయ్యం, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడిగా ఆయన అభివర్ణించాడు. మన దేశంలో ఒక బాబా ముఖ్యమంత్రి పాలస్తీనా పేరు చెప్పుకునే పబ్బం గడుపుతున్న అతడిపై కేసు నమోదు చేస్తానని చెప్పారు. అందుకే బాబా ముఖ్యమంత్రిగారూ వినండి, నేను గర్వంగా పాలస్తీనా జెండాను, మన త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తాను. నేను పాలస్తీనాకు అండగా ఉంటాను. పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదు; ఇది మానవతా సమస్య.”అని ఒవైసీ అన్నారు.

గతంలో కాంగ్రెస్ ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూనే ‘పాలస్తీనా హక్కుల’ కోసం తన మద్దతును ప్రకటించింది. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇజ్రాయెల్ దళాలు, హమాస్ తీవ్రవాద గ్రూపు మధ్య వెంటనే కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై వరుస దాడులను ప్రారంభించి వందల మందిని చంపింది. అప్పటి నుండి, దాడిలో ఇజ్రాయెల్‌లో 1,300 మందికి పైగా మరణించారు. అయితే ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులు గాజాలో 2,200 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 1,500 మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారని ఇజ్రాయెల్ పేర్కొంది.