
World Students Day 2023: ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. ఇది మన మాజీ రాష్ట్రపతి, భారత మిస్సైల్ మ్యాన్ అయిన డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘనంగా జరుపుకుంటారు. అబ్దుల్ కలాం భారతదేశానికి 11వ రాష్ట్రపతి అయ్యారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు కూడా. ఆయన సాధించిన గొప్ప విజయాలకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా లభించింది. భారతదేశ విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. విద్యార్థులంటే ఆయనకు చాలా అభిమానం. ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూనే తుది శ్వాస విడిచారు. అక్కడ ఆయన గుండెపోటుతో మరణించారు.
ఈ సంవత్సరం థీమ్ ఏమిటి?
ఈ సంవత్సరం థీమ్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సంవత్సరం “ఫెయిల్: లెర్నింగ్‌లో మొదటి ప్రయత్నం” థీమ్‌గా ఎంపిక చేయబడింది. ఈ ఇతివృత్తం ద్వారా, వైఫల్యం అంతం కాదు, వైఫల్యం అభ్యాసానికి మొదటి మెట్టు అనే వాస్తవంపై దృష్టి సారించే ప్రయత్నం చేయబడింది. ఈ రోజు కూడా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సందర్భంగా విద్య యొక్క ప్రాముఖ్యత, డాక్టర్ అబ్దుల్ కలాం యొక్క విజయాలు చెప్పబడ్డాయి. విద్యార్థులను ప్రోత్సహించే డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పిన కొన్ని గొప్ప సూక్తుల గురించి తెలుసుకుందాం.
*ఎవరినైనా తెలిగ్గా ఓడించవచ్చు.. కానీ, వారి మనసును గెలవాలంటే మాత్రం.. ఎంతో శ్రమించాలి.
*ఇతరులను ఓడించడం సులువే.. కానీ, ఇతరులను గెలవడం కష్టం. …
*నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే.. ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి.
*మీరు మీ భవిష్యత్తును మార్చలేరు. కానీ, మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి.. మీ అలవాట్లు.. మీ భవిష్యత్తును మారుస్తాయి.
*మీ ప్రయత్నం లేకపోతే.. మీకు విజయం రాదు. కానీ, మీరు ప్రయత్నిస్తే.. ఓటమి రాదు.
*మన జననం సాధారణమైనదే కావచ్చు. కానీ, మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి.
*నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే.. నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే.. నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి.. చాలామంది ఎదురు చూస్తుంటారు.
*సక్సెస్ అంటే.. మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే!
*అందం ముఖంలో ఉండదు సాయం చేసే మనసులో ఉంటుంది.
*కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు.. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి.. నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి.. నిన్ను సాధించడం కష్టమని.
*జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే.. విజయాలను ఆస్వాదించగలం.
*ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం.. కానీ, ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంలో సమానం.
*కల అంటే నిద్రలో వచ్చేది కాదు.. నిద్ర పోనివ్వకుండా చేసేది.
*సైన్స్ అనేది మానవాళికి ఒక అందమైన బహుమతి, మనం దానిని పాడు చేయకూడదు.
*మీ మిషన్‌లో విజయం సాధించాలంటే, మీ లక్ష్యం పట్ల మీరు ఏక మనస్సు గల భక్తిని కలిగి ఉండాలి.”
*చిన్న లక్ష్యం నేరం, లక్ష్యం గొప్పదై ఉండాలి.
*ఏ విద్యార్థి యొక్క అతి ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ప్రశ్నలు అడగడం, కాబట్టి విద్యార్థులను ప్రశ్నలు అడగనివ్వండి.