
Tirumala: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను అలరించేలా 14 రాష్ట్రాల నుంచి కళా బృందాలు విచ్చేస్తున్నట్లు టీటీడీ జేఈవో సదా భార్గవి వెల్లడించారు. ప్రతిరోజూ 17 కళాబృందాలు ప్రదర్శన ఇస్తాయని ఆమె తెలిపారు. గరుడ వాహనం రోజు అదనపు బృందాలు కళా ప్రదర్శన చేస్తాయని చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో విశేష స్పందన వచ్చిందన్నారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక నిపుణులు కళాబృందాలను ఎంపిక చేశామన్నారు. ఏపీ నుండి కోలాటాల ప్రత్యేకంగా ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. పెద్దశేష వాహనంలో 17 బృందాలు ప్రదర్శనలు చేస్తాయన్నారు. ఒక్కో టీమ్‌కి 25 మంది కళాకారులు ఉంటారని.. రేపు కర్ణాటక బృందాలు, మూడవరోజు తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలు ప్రదర్శన చేస్తాయని చెప్పారు. నాల్గవ రోజు తెలంగాణ కళా బృందాలు ప్రదర్శన చేస్తాయన్నారు టీటీడీ జేఈవో సదా భార్గవి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరాఖండ్ కళా బృందాలు ప్రదర్శనలు ఇస్తామయని చెప్పారు. గతంలో కంటే బ్రహ్మోత్సవాలలో ఎక్కువగా కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు.