
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులు కాదు.. కాదు.. సినిమా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కనపెడితే.. ఎక్కడైనా నిర్మొహమాటంగా మాట్లాడడంలో బాలయ్య ముందు ఉంటాడు. ఎవరైనా ఏదైనా అంటారు అన్న భయం ఇసుమంతైనా కనిపించదు. ఇక మొన్న అసెంబ్లీలో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తొడకొట్టడం, విజిల్స్ వేయడం లాంటివి చూస్తూనే ఆ విషయం అందరికి అర్ధం అయిపొయింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ .. భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్, శ్రీలీ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. నేడు ఈ సినిమా ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
Nani: ప్రభాస్ సలార్ రిలీజ్ పై నాని ఏమన్నాడంటే.. ?
ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య.. ట్రోలర్స్ కు చురకలు అంటించాడు. గతంలో తన విగ్ పై కామెంట్స్ చేసినవారిపై విరుచుకుపడ్డాడు. తనకు భయం లేదని.. ఏదైనా డైరెక్ట్ గా అనేస్తాను అని చెప్పుకొచ్చాడు. కెమెరా మ్యాన్ రాంప్రసాద్ గురించి బాలయ్య మాట్లాడుతూ.. ” ఆయనతో ఎలా ఉంటుంది అంటే.. నా ప్రతి కదలిక ఆయనకు తెలుసు. విఎస్ స్వామి దగ్గర నుంచి కూడా.. ఆయన అసిస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా మేమంతా కలిసి టిఫిన్ లు చేసేవాళ్ళం.. కలిసి భోజనం చేసేవాళ్ళం.. ఆరోజుల్లో ఈరోజుల్లా క్యార్ వ్యాన్ లు లేవు కదా .. హ్యాపీగా ఒక చెట్టు కింద కూర్చొని, కింద ఒక చాప వేసుకొని, దిండు వేసుకొని పడుకొనేవాళ్ళం. విగ్ అందరి ముందు తీసేవాడిని. మొన్న ఎవడో అన్నాడు వెధవ.. వీడు విగ్ పెట్టుకుంటాడా అని.. అవును, నేను విగ్ పెట్టుకుంటే.. నీకెంటయ్య.. నువ్వేం పీక్కొని గడ్డం పెట్టుకున్నావని అడిగా.. ఓపెన్ బుక్ మనమంతా.. ఎవడికి భయపడలే.. వాడికి చెప్తున్నా మళ్ళీ. కెమెరా మ్యాన్ అలా తీసుకొస్తాడు.. డైరెక్టర్ కట్ అన్న కూడా ఆయన చేయదు.. ఆ లాస్ట్ మూమెంట్ లో ఆ కదలికలను పట్టుకుంటాడు. కాళ్ల నుంచి పైకి, చేతుల నుంచి మొహానికి.. ఎలానో చేస్తూ ఉంటాడు. అవి ఉంటాయి సినిమాలో.. అది మా అండర్ స్టాండింగ్.. ఒకరిని ఒకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాము” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలయ్య మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.