
YSRCP: లండన్‌లో వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి, APSSDC రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చల్లా మధు, వైసీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. వైఎస్ జగన్ పేద ప్రజల కోసం అనుక్షణం పని చేస్తున్నారని ఆయన తెలిపారు. అవినీతిపరులకు సింహస్వప్నంగా నిలిచిన వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని ఆయన సూచించారు.