Leading News Portal in Telugu

Kismat Teaser: మరో మ్యాడ్ అయ్యేలా ఉందే..


Kismat Teaser: మరో మ్యాడ్  అయ్యేలా ఉందే..

Kismat Teaser: ఈ మధ్య ఫ్రెండ్ షిప్ స్టోరీలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. నలుగురు, ముగ్గురు ఫ్రెండ్స్.. వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా దర్శకులు కథలు అల్లి.. ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు. కుర్రకారు.. వారిలో తమను తాము చూసుకుంటూ సినిమాలను హిట్ చేసేస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజ్ బ్యాక్ డ్రాప్.. ముగ్గురు ఫ్రెండ్స్.. వారి లవ్ స్టోరీలు.. ఇలా సాగింది. డే 1 నుంచి కూడా ఈ సినిమా నుంచి పాజిటివ్ టాక్ అందుకొని మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇలాంటి సినిమానే మరొకటి రెడీ అవుతుంది.. అదే కిస్మత్. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రియా సుమన్ కథానాయికగా నటిసస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు.

Naveen Polishetty: మంచి ఆటగాళ్లు.. ట్రావెలర్ అన్వేష్ ను ఇమిటేట్ చేసిన నవీన్

టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బిగ్ ఫెయిల్యూర్ అయిన ముగ్గురు బడ్డీ దోస్తులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వ దేవ్ హోప్ కోల్పోయి ఉంటాడు, అభినవ్ గోమతం రచయితగా సినిమాల్లోకి ప్రవేశించాలని చూస్తుంటాడు, నరేష్ అగస్త్య రియా సుమన్‌తో ప్రేమలో ఉంటాడు. అనుకోని సంఘటనతో వారి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిపోయిందన్నదే తెరపై చూడాలి. శ్రీనాథ్ బాదినేని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు, ఇందులో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగులు యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. నరేష్ అగస్త్య , అభినవ్ గోమఠం, విశ్వ దేవ్, శ్రీనివాస్ అవసరాల తమ టాప్ పెర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి విప్లవ్ నైషధం ఎడిటర్. కిస్మత్ నిర్మాతలు సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమా.. మ్యాడ్ లా మరో హిట్ అవుతుందో లేదో చూడాలి.