
సంపూర్ణేశ్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ పొలిటికల్ సెటైరికల్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్. ఈ సినిమా అక్టోబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.పూజా అపర్ణా కొల్లూరు ఈ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తోంది.ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో ప్రీమియర్స్ వేయగా.. మంచి స్పందన వచ్చింది. తాజాగా వరంగల్ లో ప్రీమియర్ veyaడం జరిగింది. ఐదో రోజున ఏర్పాటు చేసిన వరంగల్ ప్రీమియర్ షోలో సంపూర్ణేశ్ బాబు, నరేశ్, శరణ్య ప్రదీప్, వెంకటేశ్ మహా అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ టీం సందడి చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఓటు హక్కు ఉన్నవాళ్లే కాకుండా . చిన్నపిల్లలు కూడా చూడాల్సిన సినిమా అని ప్రేక్షకులు తెలిపారు మార్టిన్ లూథర్ కింగ్ టైటిల్ అద్భుతంగా ఉందని, కరెక్ట్ టైంలో సినిమాను దించారని అంటున్నారు. నాయకుడిని ప్రశ్నించే లాగా.. మనల్ని మేల్కొలిపే లాగా సంపూర్ణేశ్ యాక్టింగ్ ఉందని వారు చెబుతున్నారు.
ఈ మూవీలో వెంకటేశ్ మహా, నరేశ్, శరణ్య ప్రదీప్, ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని వై నాట్ స్టూడియోస్ , రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వెంకటేశ్ మహా హోం బ్యానర్ మహాయణా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన మార్టిన్ లూథర్ కింగ్ టీజర్‌లో సంపూర్ణేశ్ బాబు కంప్లీట్ డీగ్లామరైజ్‌డ్ రోల్‌లో కనిపిస్తూ.. సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాడు..సంపూర్ణేశ్ బాబు ఈ సినిమాలో తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఎంతగానో ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీమియర్ షో లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఎంతో ఆనందంగా వుంది మరి ఈ చిత్రం విడుదల అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి..