Leading News Portal in Telugu

MP Arvind : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఎవరికి ఓటేసినా కేసీఆర్ సీఎం అవుతారు


MP Arvind : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఎవరికి ఓటేసినా కేసీఆర్ సీఎం అవుతారు

సోనియా రాహుల్ గాంధీ జాతి వ్యతిరేకులని, కాంగ్రెస్ అధికారంలో వస్తే కేసీఆర్ కంటే ఫాస్ట్ గా రేవంత్ రాష్ట్రంలో భూములు అమ్మేస్తారన్నారు నిజమాబాద్ ఎంపీ అరవింద్. ఇవాళ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. దోపిడిలో రేవంత్ కంటే సీఎం కేసీఆర్ బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎవరికి ఓటేసిన సీఎం కేసీఆర్ అవుతారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాదు. ఎన్ని సీట్లు వచ్చిన ఏర్పడేది 100శాతం బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ నడిపిస్తుందని, బోధన్ లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత మాదేనని ఆయన వ్యాఖ్యానించారు.

కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఏజెండా కాంగ్రెస్ మోస్తుందని, బోధన్ లో పలు కాలనీలకు హిందూ పేర్లు తీసి.. ముస్లిం పేర్లు పెడుతున్నారన్నారు ఎంపీ అరవింద్. అంతేకాకుండా.. దేశంలో మూసుకుపోయిన చెక్కర ఫ్యాక్టరీల ను తెరిపించిన ఘనత మోదీ దే.రాష్ట్రం లో అధికారంలోకి వస్తే మూత పడ్డ షుగర్ ఫ్యాక్టరీ లు తెరిపిస్తాం. జాతీయ పసుపు బోర్డు తెచ్చిన మాకు నిజం షుగర్ ఫ్యాక్టరీ తేవడం చిటికెన వేలుతో సమానం. రానున్న రోజుల్లో పసుపు ధర 20 నుంచి 25 వేలు ధర దాటుతుంది. 400 శాతం ఎగుమతులు పెంచాలని చెప్పి ప్రధాని పసుపు బోర్డు ప్రకటించారు.. ఎన్.ఆర్.ఐ. లకు కాంగ్రెస్ , బి.ఆర్.ఎస్. మోసం చేసింది. మేలు చేసేది బీజేపీ ఒక్కటే. దొంగ ఓట్లు, దొంగ నోట్లు దొంగ పాస్ పోర్టులకు అడ్డా బోధన్ కాంగ్రెస్ ను గెలిపిస్తే బోధన్ లో నిజాం షుగర్ భూములను రియల్ ఎస్టేట్ చేసేది రేవంత్ రెడ్డి నే..’ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు.