
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను బీజేపీ పార్టీ నుండి మునుగోడు లో పోటీ చేస్తానన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కౌరవ సైన్యంపై నైతిక విజయం మునుగోడు ప్రజలు తనకు అందించారన్నారు. ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినా గాని 87 వేల ఓట్లు వేసి నైతిక విజయం మునుగోడు ప్రజలు ఇచ్చారు వారికి అండగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండే పోటీ చేసి గెలుస్తానన్నారు. కొందరు కుట్రపూరితంగా కావాలని తనపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నానన్నారు.
కేసీఆర్, రేవంత్ రెడ్డి లను తెలంగాణ ప్రజలు నమ్మరు వాళ్లిద్దరూ ఒక్కటేనని, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకే పార్టీ… 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలే ఒక్కటేనని అన్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆరెస్ పార్టీలో చేరారని.. ఇప్పడు కూడా అదే జరుగుతదని, ప్రజలు మరోసారి ఈ రెండు పార్టీల చేతిలో మోసపోయేందుకు సిద్ధంగా లేరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.