
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది దసరా లాంటి ఊర మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చిన నాని.. ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. అదే హయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ఈవెంట్ లో నాని.. సినిమాకు సంబంధించిన అనేక విషయాలను మీడియాతో పంచుకున్నాడు. మొదటి నుంచి కూడా హయ్ నాన్న డిసెంబర్ చివరి వారంలో ఉంటుంది అని చెప్పుకొచ్చారు. కానీ, అనుకోకుండా డిసెంబర్ 22 న వస్తున్నట్లు ప్రకటించడంతో.. మిగతా సినిమాలు అన్ని యూ టర్న్ తిప్పుకున్నాయి. నాని సైతం తన సినిమాను.. సలార్ తో పోటీకి దింపలేక.. వెనక్కి తగ్గి.. డిసెంబర్ మొదటి వారం.. అనగా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఇక ఇదే విషయం గురించి నాని ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.
Ajith: అజిత్ ఫేవరేట్ ఆర్ట్ డైరెక్టర్.. గుండెపోటుతో మృతి
నాని గారు.. సలార్ సినిమా రావడంతో మీ సినిమా ముందుగా విడుదల చేయడం ఎలా అనిపిస్తుంది? అన్న ప్రశ్నకు నాని మాట్లాడుతూ.. “ఒక ఇంట్లో పెద్ద అబ్బాయి కి సంబధించిన ఏదైనా వేడుక వుంటే.. చిన్నోడి వేడుకని ముందుకు వెనక్కి జరపడం సహజం. దీని వలన ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ అంతా ఒక లవ్ స్టొరీ, యాక్షన్ సినిమాలతో కళకళలాడిపోతుంది. ఇంతకంటే మనకేం కావాలి” అంటూ నవ్వేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి నాని ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.