Leading News Portal in Telugu

Prabhas: ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ మిస్‌.. కారణం ఇదేనా?


Prabhas: ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ మిస్‌.. కారణం ఇదేనా?

టాలివుడ్ యంగ్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు అస్సలు ఉండరు.. వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియా అకౌంట్స్ ను వాడాడు.. కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే వాడుతారు ప్రభాస్..ఇదిలా ఉండగా తాజాగా ఈ పాన్‌ ఇండియా స్టార్‌ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎవరో హ్యాక్‌ చేశారు. ఇన్‌స్టాలో ప్రభాస్‌ పేరును సెర్చ్‌ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’అనే సందేశం వస్తోంది. ఫ్యాన్‌మేడ్‌ అకౌంట్స్‌ మాత్రం కనిపిస్తున్నాయి కానీ అఫిషియల్‌ అకౌంట్‌ మిస్‌ అయింది. ప్రస్తుతం హ్యాక్‌ అయిన అకౌంట్‌ని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రభాస్‌ టీమ్‌ ప్రయత్నిస్తోందని తెలుస్తుంది..

అయితే గతంలో డార్లింగ్ ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ కూడా హ్యాకింగ్‌కు గురైంది. ‘మనుషులు దురదృష్టవంతులు’ అంటూ హ్యాకర్లు ప్రభాస్‌ అకౌంట్‌ నుంచి ఓ వీడియో వదిలారు. అది చూసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అంతా కంగారు పడ్డారు. దీంతో తన అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు ప్రభాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌ అవ్వడం పట్ల ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ప్రభాస్ క్రేజ్ ను తట్టుకోలేక యాంటి ఫ్యాన్స్ ఇలా చేశారని మండిపడుతున్నారు..

ఇకపోతే ప్రభాస్‌ సినిమా విషయాలకొస్తే.. డిసెంబర్‌ 22న సలార్‌ పార్ట్‌ 1 విడుదల కాబోతుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతీహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్నాడు.. అలాగే దర్శకుడు మారుతి తో రాజా డీలక్స్‌, సందీప్‌ వంగతో స్పిరిట్‌ చిత్రాల్లో ప్రభాస్‌ నటించనున్నాడు.. బాహుబలి తర్వాత వచ్చిన సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కనీసం ఈ సినిమాలన్న ఫ్యాన్స్ ను అల్లరిస్తాయోమో చూడాలి..