Leading News Portal in Telugu

BRS Manifesto Live updates: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. లైవ్ అప్‌డేట్స్



Cm Kcr Brs Manifesto

BRS Manifesto Live updates:తెలంగాణ భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్‌లోని విజిటర్స్ రిజిస్టర్‌పై సంతకం చేశారు. అంతముకుందులో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఇతర నేతలు సీఎం కేసీఆర్‌కు ఘనంగా ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు కాసేపట్లో కేసీఆర్ బీ-ఫారాలు అందజేయనున్నారు. అనంతరం అభ్యర్థులతో కలిసి భోజనం చేస్తారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తారు.