
Bodhan Municipal Chairman Padma Sharath Reddy Joins Congress Today: తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన వచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలుబడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారం రంగంలోకి దిగేశాయి. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్‌ఎస్.. ప్రచారంలోనూ అదే ఊపుతో దూసుకెళుతోంది. అయితే మరోసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ చైర్మన్ దంపతులు పద్మ శరత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మున్సిపల్ చైర్మన్ బాటలోనే పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు అధికార పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
బోధన్ మున్సిపల్ చైర్మన్ దంపతులు పద్మ శరత్ రెడ్డి, వారి అనుచరులు నేడు గాంధీ భవన్‌కు ర్యాలీగా వెళ్లనున్నారు. అయితే ర్యాలీగా వెళితే వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దాంతో ఒక్కోరిగా కార్యకర్తలు, నాయకులు గాంధీ భవన్‌కు బయలుదేరారు. గాంధీ భవన్ వద్ద ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది.