Leading News Portal in Telugu

Cricket Stadium: ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్‌లో తప్పిన ప్రమాదం.. ఊడిపడిన భారీ బోర్డు


Cricket Stadium: ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్‌లో తప్పిన ప్రమాదం.. ఊడిపడిన భారీ బోర్డు

Cricket Stadium: వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్‌ ఈ రోజు లక్నోలో జరుగుతుంది. అయితే మ్యాచ్ మధ్యలో భారీ వర్షం, తుపాన్ వచ్చింది. దీంతో గాలిదుమారానికి స్టేడియంలోని ఓ భారీ బోర్డు ఊడి ప్రేక్షకులు కూర్చునే సీట్ల మధ్య పడిపోయింది. అయితే అది ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అక్కడ ప్రేక్షకులు తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొంతసేపు వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత వర్షం ముగిసాక తిరిగి ఆట ప్రారంభమైంది. మళ్లీ శ్రీలంక ఇన్నింగ్స్ అయిపోయాక కూడా కొద్దిసేపు వర్షం కురిసింది. ఎట్టకేలకు వర్షం తగ్గడంతో మ్యాచ్ ప్రారంభమైంది.