
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశాన్ని నియంతలా పాలిస్తున్నాడు, కానీ అతనో నియంత అని అక్కడి ప్రజలకు కూడా తెలియదు. అతడిని అతని నాన, తాతలను అక్కడ దేవుళ్లుగా కొలుస్తుంటారు. ఇదిలా ఉంటే అక్కడి శిక్షల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. సౌత్ కొరియా సినిమాలు చూసినా, ఏదైనా మతాన్ని పాటించినా, కనీసం పాటలు విన్నా కూడా అక్కడి మరణమే గతి. ఆ శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి.
కిమ్ నాయకత్వంపై తిరుగుబాటు చేయడమే కాదు, చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా అత్యంత దారుణంగా చంపేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర కొరియాలో జరిగింది. తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా హత్య చేశారు.
మాంసాన్ని ఆహారంగా తీసుకునే అత్యంత ప్రమాదకరమైన చేపలైన ‘పిరాన్హా’ చేపలకు ఆహారంగా వేసినట్లు డైలీస్టార్ నివేదించింది. తిరుగుబాటుకు కుట్ర చేశాడని చెబుతూ..అతని కాళ్లు, చేతులు నరికేసి, పిరానా చేపలు ఉన్న కొలనులో పడేసి చంపేశారు. కిమ్ ర్యాంగ్‌సాగ్ రెసిడెన్స్ లో ఈ భారీ ఫిష్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు నివేదించింది. 1977లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా ‘ ద స్పై హూ లవ్డ్ మీ’ సినిమాలో విలన్ తన ప్రత్యర్థులను షార్క్ చేపలు ఉన్న ఆక్వేరియంలో వేసి హత్య చేస్తుంటాడు. సరిగ్గా ఇలాగే కిమ్ తనపై కుట్ర పన్నిన వ్యక్తిని పిరాన్హా చేపలకు ఆహారంగా వేశాడు.
కిమ్ తన ఆక్వేరియం కోసం వందల పిరాన్హా చేపలను బ్రెజిల్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాడని భావిస్తున్నారు. మాంసాన్ని తినే ఈ చేపలు పదునైన రేజర్ దంతాలను కలిగి ఉంటాయి. ఇవది నిమిషాల్లో మాంసాన్ని చీల్చి తినేస్తాయి. 2011లో అధికారం చేపట్టిన కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటి వరకు పలు ఆరోపణల్లో 16 మంది కీలక అధికారులను అత్యంత దారుణంగా మరణశిక్ష విధించాడు. దీనికి ముందు ఇలాగే 2019లో తిరుగుబాటుకు కుట్ర పన్నాడని ఓ జనరన్‌ని ఉరితీశాడు. పులులకు ఆహారంగా ఇవ్వడం, ఆకలితో ఉన్న కుక్కలు ఎరగా వేయడం, తలలు నరికి చంపడం, సజీవ దహనం చేయడం వంటి అత్యంత క్రూరమైన శిక్షణలను కిమ్ రాజ్యంలో విధిస్తుంటాడు.