Leading News Portal in Telugu

Egypt: ఈజిప్టు రాణి సమాధిలో 5000 ఏళ్ల నాటి వైన్ లభ్యం..


Egypt: ఈజిప్టు రాణి సమాధిలో 5000 ఏళ్ల నాటి వైన్ లభ్యం..

Egypt: ఈజిఫ్ట్ చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది. అక్కడి ఫారో రాజుల పరిపాలన, మమ్మీలు ఇలా అనేక వింతలకు పుట్టినిల్లు. చాలా మంది రాజులు, రాణులు సమాధుల్లో ఎంతో సంపద లభించడం మనం చూశాం. టూటెన్‌కామూన్ రాజుకు సంబంధించిన శాపం, అతని సమాధి నుంచి లభించిన వెలకట్టలేదని సంపద గురించి విన్నాం. ఇలా చాలా సమాధుల్లో అనేక అపురూప వస్తువలు లభించాయి. చనిపోయిన తర్వాత మమ్మీగా మార్చిన అనంతరం వారికి ఇష్టమైన వస్తువుల్ని వారి సమాధుల్లో ఉంచడం ఆనవాయితీ. కొన్ని సమాధుల్లో లభించిన వేల ఏళ్ల నాటి తేనె ఇప్పటికీ అలాగే చెడిపోకుండా ఉంది.

తాజాగా ఈజిప్టు రాణి క్వీన్ మెరెట్-నీత్ సమాధిని కనుగొన్నారు. దాదాపుగా 5000 వేల ఏళ్ల నాటి ఈమె సమాధిలో ఆనాటి సీల్డ్ ‘వైన్’ సీసాలను కనుగొన్నారు. ఈమెను ఈజిప్టును పాలించిన మొదటి మహిళా ఫారో అని నమ్ముతారు. వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తే శాస్త్రవేత్త క్రిష్టియానా కోహ్లెర్ నేతృత్వంలోని జర్మన్-ఆస్ట్రియన్ టీం అబిడోస్ లోని క్వీన్ మెరెట్-నీత్ సమాధిని తవ్వుతుండగా.. వారు పెద్ద జాడీల్లో వైన్ ని కనుగొన్నారు.

సమాధిలో చాలా సేంద్రీయ అవశేషాలు, ద్రాక్ష విత్తనాలు, స్పటికాలను కొనుగొన్నామని, ప్రస్తుతం వాటిని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నామని పరిశోధకులు చెప్పారు. సమాధి కాంప్లెక్స్ మధ్యలో రాణి సమాధి ఉంటే.. దాని చుట్టూ సభికులు, సేవకుల ద్వితీయ సమాధులు కూడా ఉన్నాయి. ఈ పురాతన వైన్ జాడీల్లో ఇప్పటికీ కొన్ని సీల్డ్ చేయబడి ఉన్నాయి. నిజానికి మెరెట్-నీత్ రాణికి సంబంధించి చాలా విషయాలు మిస్టరీగా ఉన్నాయి. ఈజిప్టులో మొదటి రాజ శ్మశానవాటిక కలిగిన ఏకైక మహిళ ఇమే.

సమాధిలో దొరికిన శాసనాల ప్రకారం 3000 BCలో ట్రెజరీ వంటి ప్రభుత్వ శాఖను నిర్వహించినట్లుగా పరిశోధకులు నిర్దారించారు. ప్రస్తుత తవ్వకాలు ఆమె జీవిత కాలం, ఇతర విషయాలను వెలుగులోకి తెస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమాధిలో మెరిట్-నీత్ సమాధి చుట్టూ 41 మంది సభికులు, సేవలకుల సమాధులు ఉన్నాయి. కాల్చని మట్టి ఇటుకలు, మట్టి, కలపతో నిర్మించారు.