Leading News Portal in Telugu

AP High Court: సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు


AP High Court: సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను నవంబర్‌ 1వ తేదీకి వాయిదా వేసింది.. అమరావతి రాజధాని ప్రాంతంలోని అసైన్డ్‌ భూముల వ్యవహారం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ క్వాష్‌ పిటిషన్లపై గతంలో తీర్పు రిజర్వ్‌ చేసింది హైకోర్టు.. అయితే, ఈ కేసులపై విచారణ రీ ఓపెన్‌ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది ఏపీ సీఐడీ.. అయితే, అభ్యంతరాలపై కౌంటర్‌ దాఖలు చేస్తామని హైకోర్టుకు తెలిపారు చంద్రబాబు, నారాయణ తరఫు న్యాయవాదులు.. మరోవైపు ఈ రోజు అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిట్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.. అలాగే చంద్రబాబును అరెస్ట్‌ చేయవద్దు అంటూ సీఐడీ పీటీ వారెంట్‌పై హైకోర్టు ఇచ్చిన స్టే నేటితో ముగియనుంది.. దీంతో… దానిపై కూడా ఈ రోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్‌ కోసం నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబశివరావు, ఆ సంస్థ ఉద్యోగి ప్రమీల వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. దీంతో.. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.