Leading News Portal in Telugu

Ronald Rose : అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం


Ronald Rose : అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం

అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. 2022లో 2 లక్షల 75 వేల డూప్లికేట్ ఓట్లను తొలగించామని, గడిచిన వారం రోజుల్లో 50 వేల నకిలీ ఓట్లు తొలగించామని ఆయన పేర్కొన్నారు. 3 లక్షల 61 వేల ఓట్లకు షిఫ్ట్ అయిన వారు అప్లై చేసుకున్నారని, ఓటర్ ఐడెంటిఫికేషన్ స్లిప్స్ ను ప్రతి ఓటర్ కు పంచుతామని ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా ఎక్కడ ఓటు వెయ్యాలి అని క్లారిటీ వస్తుందన్నారు.

అంతేకాకుండా.. పకడ్బందీ గా ఎలెక్టోరల్ చేశామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్.. 90 ఫ్లయింగ్ స్క్వాడ్ లతో పాటు జిల్లా పరిధిలో 18 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. చెకింగ్ చేస్తున్న క్రమం లో ప్రతిదీ వీడియో రికార్డింగ్ చేస్తామని, క్యాష్ తీసుకువెళ్తున్న, బంగారం తమతో తీసుకెళ్తున్న ప్రతిదానికీ ప్రూఫ్ క్యారీ చేయాలని ఆయన సూచించారు. 10 లక్షలకు పైగా క్యారీ చేస్తే వాటిని ఐటీకు పంపుతామన్నారు. మద్యం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై ఎలక్షన్ చాలా సీరియస్ గా ఉందన్నారు. నామినేషన్ నవంబర్ 3 నుండి స్వీకరిస్తాము..10 నామినేషన్ స్వీకరణ చివరి తేదీ.. అని, 13 న స్క్రూటినీ,15 నామినేషన్లు విత్ డ్రా కు చివరి తేదీ అని తెలిపారు.

11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ చేస్తామని, జిల్లా వ్యాప్తంగా 15 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారన్నారు. 3,986 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా..18.9 కోట్లు ఇప్పటికీ పోలీసులు సీజ్ చేశారు..15 లక్షల రూపాయల ఫ్లయింగ్ స్క్వాడ్ లు సీజ్ చేశారు.. 132 కేసులు ఇప్పటి వరకు నమోదు చేశాం.. పబ్లిక్ ప్రాపర్టీ 1 లక్ష 5 వేల బ్యానర్లు,పోస్టర్ లు తొలగించాం.. 2,300 లీటర్ల మద్యం సీజ్ చేశాం.. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుండి 50 వేల ఓట్ల తొలగించాం.’ అని రోనాల్డ్‌ రోస్‌ వెల్లడించారు.