Leading News Portal in Telugu

Mohan Lal: వంద రోజుల్లో లాల్ నుంచి పాన్ ఇండియా సినిమా…


Mohan Lal: వంద రోజుల్లో లాల్ నుంచి పాన్ ఇండియా సినిమా…

మలయాళ సినీ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ ‘జల్లికట్టు’. న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లీజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో లీజో జోస్ పెల్లిసరీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ఏకంగా మోహన్ లాల్ పిలిచి సినిమా ఇచ్చే అంత స్టార్ దర్శకుడు అయిపోయాడు లీజో జోస్ పెల్లిసరీ. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, న్యూ ఏజ్ డైరెక్టర్ లీజో జోస్ పెల్లిసరీ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే అనౌన్స్మెంట్ బయటకి రాగానే కేరళ సినీ అభిమనులు ఒక మాస్టర్ పీస్ సినిమా చూడబోతున్నాం అనే గట్ ఫీలింగ్ లోకి వచ్చేసారు. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకుల్లో భారి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ “మలైకొట్టై వలిబన్”గా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

మాలైకొట్టై కి చెందిన యువకుడు అనే అర్ధం వచ్చే ఈ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మోహన్ లాల్ రెజ్లర్ గా కనిపించానున్నాడు. 2023 జనవరిలో మొదలైన “మలైకొట్టై వలిబన్” 2024 జనవరి 25న పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రానుంది. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 100 డేస్ టు “మలైకొట్టై వలిబన్” అనే ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. “మలైకొట్టై వలిబన్” సినిమాకి ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తుండగా, మధు నీలకందన్ సినిమాటోగ్రఫి వర్క్ చేస్తున్నాడు. ఈ భారి ప్రాజెక్ట్ ని జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిల్మ్స్, మాక్స్ లాబ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపు రాజస్థాన్ లోనే జరుపుకోనున్న ఈ మూవీతో మోహన్ లాల్… మన్యం పులి, లూసీఫర్ రికార్డులని బ్రేక్ చేస్తాడని మలయాళ ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.