Leading News Portal in Telugu

Vladimir Putin in China: చైనా పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌..


Vladimir Putin in China: చైనా పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌..

Vladimir Putin in China: రష్యా అధ్యక్షుడు వ్లాదిపూర్‌ పుతిన్‌.. చైనాకు చేరుకున్నారు.. డ్రాగన్‌ కంట్రీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తవుతోన్న సందర్భంగా.. దీనిని పురస్కరించుకుని బీజింగ్‌లో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నారు.. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. పుతిన్‌ను ఆహ్వానించారు.. చైనా ఆహ్వానం మేరకు ఈ రోజు బీజింగ్‌ చేరుకున్నారు పుతిన.. ప్రత్యేక విమానంలో పుతిన్‌ ఈ రోజు బీజింగ్‌లో అడుగుపెట్టారు.. చైనా మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. మొత్తంగా తన ప్రియమైన స్నేహితుడు జిన్‌పింగ్‌ను కలవడానికి రష్యాకు చెందిన పుతిన్ చైనా చేరుకున్నారు.

పుతిన్ తన కమ్యూనిస్టు పొరుగు దేశమైన చైనాతో ఇప్పటికే బలమైన సంబంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నాడు.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో కప్పివేయబడే శిఖరాగ్ర సమావేశంలో వారి సంబంధాన్ని బలపరిచారు. బీజింగ్ తన ప్రపంచ ప్రభావాన్ని విస్తరించడానికి ఉపయోగిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ప్రెసిడెంట్ జి యొక్క మైలురాయి ప్రాజెక్ట్ ఫోరమ్ కోసం చైనా ఈ వారం 130 దేశాల ప్రతినిధులను స్వాగతించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా పుతిన్‌పై ఒత్తిడి పెరిగిపోయింది.. యుద్ధ నేరాల కేసులో పుతిన్‌ను అంతర్జాతీయ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయన అరెస్టుకు ఆదేశాలు కూడా జారీచేసింది. దీంతో పుతిన్‌ విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటున్నారు.. భారత్‌లో జరిగిన జీ20 సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు. కానీ, మొదటి చైనాలో పర్యటిస్తున్నారు.. చైనా ఆహ్వాన జాబితాలో పుతిన్ అగ్రస్థానంలో ఉన్నారు. పుతిన్ ప్రత్యేక విమానం ఈ రోజు ఉదయం 09:30 గంటలకు ముందు చైనాలో ల్యాండ్ అయింది.. అతను బుధవారం చర్చల కోసం జిన్‌పింగ్‌ను కలవబోతున్నాడు.. చర్చల సందర్భంగా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది..