Leading News Portal in Telugu

Shahid Afridi: షాహిద్‌ అఫ్రిది సోదరి మృతి.. కుటుంబంలో విషాదఛాయలు


Shahid Afridi: షాహిద్‌ అఫ్రిది సోదరి మృతి.. కుటుంబంలో విషాదఛాయలు

పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మంగళవారం ఉదయం మృతిచెందింది. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని అఫ్రిది సోషల్‌ మీడియాలో తెలిపాడు.

“మా సోదరి మమ్మల్ని విడిచిపెట్టి ఆ దేవుడు వద్దకు వెళ్లిపోయింది. ఆమె మరణవార్తను మా బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. ఆమె ఆంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి” అని అఫ్రిది ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ మరణవార్త తెలిసిన ప్రముఖులు, అభిమానులు అఫ్రిదికి సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అంతకుముుందు “తన చెల్లిని చూసేందుకు వెళ్తున్నాననీ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని శనివారం రాత్రి ఆఫ్రిది ట్విట్‌ చేశాడు. కానీ అతడు ట్వీట్‌ చేసిన గంటల వ్యవధిలోనే ఆమె మృతి చెందింది. దీంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇక అఫ్రిది కుటుంబంలో మొత్తం 11 మంది ఉన్నారు. అందులో ఆరుగురు సోద‌రులు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. సోద‌రులు తారిక్ అఫ్రిది, అష్ఫక్ అఫ్రిది.. వీరు కూడా క్రికెట‌ర్లే.