Leading News Portal in Telugu

Festive Sale: స్మార్ట్ఫోన్ ఉపయోగించని వారికి గుడ్న్యూస్.. కీప్యాడ్ మొబైల్‌ సగం ధరకే..!


Festive Sale: స్మార్ట్ఫోన్ ఉపయోగించని వారికి గుడ్న్యూస్.. కీప్యాడ్ మొబైల్‌ సగం ధరకే..!

స్మార్ట్‌ఫోన్లు వచ్చిన దగ్గరి నుంచి కీప్యాడ్ మొబైల్ల డిమాండ్ తగ్గిపోయింది. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే కనపడుతున్నాయి. ఎక్కడో పల్లెటూర్లలో, స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడాలో తెలియని వాళ్ల దగ్గరే కీప్యాడ్ మొబైల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ వాడే వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. కీప్యాడ్ మొబైల్‌లపై పండగ ఆఫర్ సందర్భంగా కొన్ని మొబైల్ కంపెనీలు భారీగా ధరలు తగ్గిస్తున్నారు. కీప్యాడ్ మొబైల్‌లపై అందుబాటులో ఉన్న తగ్గింపుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Motorola A10e
ఈ Motorola ఫోన్ డ్యూయల్ సిమ్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ. 1599. దీనిని మీరు 22 శాతం తగ్గింపుతో కేవలం రూ. 1249కి కొనుగోలు చేయవచ్చు. ఈ Motorola ఫోన్ 800mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే మీరు మైక్రో SD కార్డ్ సహాయంతో ఫోన్ మెమరీని 32 GB వరకు పొడిగించుకోవచ్చు. ఈ ఫోన్ రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

నోకియా 5310
నోకియా ఎల్లప్పుడూ నమ్మదగిన బ్రాండ్. కంపెనీ కీప్యాడ్ మొబైల్‌లు ఇప్పటికీ వినియోగదారుల యొక్క మొదటి ఎంపిక. నోకియా 5310 ఫోన్ అసలు ధర రూ. 4,299. మీరు కేవలం రూ. 3,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో MP3 ప్లేయర్, FM రేడియో, బ్యాక్ కెమెరా ఉన్నాయి.

JioBharat B1 4G
జియో ఫోన్ 4G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. జియో సినిమా, జియో సావన్, జియో పే ఈ ఫోన్‌లో ఉపయోగించవచ్చు. ఈ ఫోన్‌లో 2000mAh బ్యాటరీ, డిజిటల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 1,999. మీరు కేవలం రూ. 1299కి కొనుగోలు చేయవచ్చు.