Leading News Portal in Telugu

Tea Heating : టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా? డేంజర్లో పడ్డట్లే…


Tea Heating : టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా? డేంజర్లో పడ్డట్లే…

పొద్దున్నే లేవగానే చాలా మందికి బెడ్ కాఫీ, లేదా టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. టీలో ఏముందో తెలియదు కానీ జనాలు ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీని ఆస్వాదిస్తారు.. అందుకే మనకు గల్లీకి రెండు, మూడు టీ కొట్లు ఉంటాయి.. అయితే టేస్ట్ బాగుంది కదా అని టీని పదే పదే తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..

ఇకపోతే టీని పదే పదే వేడి చేసి తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. మళ్లీ మళ్లీ వేడి చేసే టీని తాగడాన్ని ఎందుకు నివారించాలంటే.. వేడి చేసి తాగే టీలో పోషకాలు నశిస్తాయి.. రుచి మారిపోవడం మాత్రమే కాదు వాసన కూడా తగ్గిపోతుంది.. ఫ్రెష్ గా తయారు చేసిన కప్పు టీ కంటే మళ్లీ వేడి చేసినప్పుడు సిప్ చేసే టీ టేస్టు పెద్దగా వుండదు. టీని నాలుగు గంటల పాటు కాచుకున్న తర్వాత, మళ్లీ వేడి చేసి తీసుకోకపోవడమే మంచిది. ఈ సమయంలో, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది..

ఇకపోతే ఈ టీని కేవలం ఒక గంట లేదా రెండు గంటలు వరకే వుంచి ఒక్కసారి మాత్రమే వేడి చేసుకుని తీసుకోవచ్చు. ముఖ్యంగా పాలు చేర్చిన బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంది. మిల్క్ టీలో చక్కెర కలపడం ద్వారా కొన్ని రకాల క్రీములు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. పాలతో పంచదారను కలిపినప్పుడు, ఆ టీ వేగంగా చెడిపోవడానికి దారితీస్తుంది. ఇది తలనొప్పి లేదా కడుపునొప్పి వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అందుకే టీని ఒక్కసారి చేస్తే అప్పుడే తాగాలి.. మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే.. జాగ్రత్త సుమీ..