Leading News Portal in Telugu

Janasena: పార్టీ తదుపరి కార్యాచరణపై పవన్ కళ్యాణ్-నాదెండ్ల మనోహర్ చర్చ


Janasena: పార్టీ తదుపరి కార్యాచరణపై పవన్ కళ్యాణ్-నాదెండ్ల మనోహర్ చర్చ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నేడు (మంగళవారం) ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణ పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది.

జనసేన పార్టీ రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగాపెడుతున్న కేసులు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని జనసేన చీఫ్ పేర్కొన్నారు. ఏపీలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే విధంగా జనసేన పోరాటం చేస్తుందని ఆయన సూచించారు. జనసేన-టీడీపీ సమన్వయ కమిటీలపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.