Leading News Portal in Telugu

World Cup 2023 Points Table: ఆస్ట్రేలియా తొలి విజయం.. పాయింట్ల పట్టికలో మారిన ప్లేస్‌లు! టాప్ 4 జట్లు ఇవే


World Cup 2023 Points Table: ఆస్ట్రేలియా తొలి విజయం.. పాయింట్ల పట్టికలో మారిన ప్లేస్‌లు! టాప్ 4 జట్లు ఇవే

India Have Top Place in ICC Cricket World Cup 2023 Points Table: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా సోమవారం రాత్రి లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ మెగా టోర్నీలో బోణి కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆస్ట్రేలియా.. లంకపై అద్భుత విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో పైకి దూసుకొచ్చింది. అట్టడుగున ఉన్న ఆసీస్ 2 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడిన లంక 9వ స్థానంలో ఉంది.

ప్రపంచకప్‌ 2023లో ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన భారత్ 6 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజీలాండ్ (6 పాయింట్స్) రెండో స్థానంలో ఉంది. ఇరు జట్లకు సమన పాయింట్స్ ఉన్నా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ టాప్‌లో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో మూడో స్థానములో ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచిన పాకిస్తాన్ 4 పాయింట్లతో పట్టికలో నాలుగో ప్లేస్‌లో ఉంది.

ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కోటి గెలిచి రెండేసి పాయింట్లతో వరుసగా 5, 6, 7, 8 స్థానాల్లో కొనసాగుతున్నాయి. మూడు మ్యాచ్‌లలో ఓడిన శ్రీలంక 9వ స్థానంలో ఉంది. ఇక ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిన నెదర్లాండ్స్ పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. నేడు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ గెలిస్తే పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది.