Leading News Portal in Telugu

CM KCR : కేటీఆర్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు… ఆదరించి గెలిపించండి..


CM KCR : కేటీఆర్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు… ఆదరించి గెలిపించండి..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో స్పీడ్‌ పెంచింది. ఈ నేపథ్యంలోనే నేడు సిరిసిల్లలో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు మానేరు సజీవ జల ధార గా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మానేరు మట్టి కొట్టుకుపోయిందని, సిరిసిల్లలో ఆత్మహత్యలు వద్దని వాల్ రైటింగ్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు. రాష్ట్రం వచ్చాక చేనేత నేతన్నల ఆత్మహత్యలు అపగలిగినమని, షోలాపూర్ ఎట్లుంటదో సిరిసిల్ల అలా అవుతుందన్నారు. నేతన్నలకు ఉపాధి పేదలకు బట్టలు అందించే విధంగా కృషి చేశామని, కొందరు దుర్మార్గులు బతుకమ్మ చీరలు కాలబెట్టారు… వారిని బతుకమ్మ చీరలు ఎవరు కట్టుకోమన్నారు? బలవంతం చేశామా? అని కేసీఆర్‌ అన్నారు.

అంతేకాకుండా.. ‘బతుకమ్మ చీరలు పెట్టింది నేతన్నలకు ఉపాధి, పేదలకు బట్టలునిచ్చేందుకు ఉద్దేశించింది… మూడు కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయ్ అందుకే ప్రతీ ఒక్కరూ సన్నబియ్యం తినాలని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టాం.. రైతుల భూములు క్షేమంగా ఉంచేందుకు ధరణి పోర్టల్ తెచ్చాం.. కాంగ్రెస్ సిద్ధంగా ఉంది ధరణిని రద్దు చేసేందుకు కంకణం కట్టుకున్నారు… రైతు బొటనవేలు లేకుండా భూమి హక్కులు పోకుండా చేశాం ధరణి లేకపోతే హత్యలు జరిగేవి.. కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులో ఉన్న విషాన్ని కక్కిండు… 3 గంటల కరెంట్ చాలు అన్నాడు. మోడీ వ్యవసాయ బావుల కు మోటార్లు పెట్టాలని అంటే తిరస్కరించాం. తెలంగాణ గంగా జమున తెహజీబ్.. కొందరు గొడవలు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు… గణేష్ నిమజ్జనం కోసం.. మిలాదున్ నబీ ని ముస్లిం పెద్దలు వాయిదా వేశారు ఇది మతసామరస్యం. కేటీఆర్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు… ఆదరించి గెలిపించండి..’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.